ఒక ఆంధ్రప్రదేశ్‌లో తప్పా దేశంలో అన్ని రాష్ట్రాలలోను కాదంబరి జాత్వాని పై కేసులు ఉన్నాయి. హాని ట్రాప్ లో ఆమె దిట్టా. ఐపీఎస్ లపై కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఆరాటంః మంత్రి పేర్ని నాని
అమరావతి బ్యూరోః తెలుగువారి పరువు దేశం మొత్తం తీసేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. ముంబాయి నుండి ఒక అమ్మాయిని తీసుకువచ్చిన పచ్చమీడియా పైసాచిక ఆనందం పొందుతుంటే చంద్రబాబునాయుడు సంతోషపడుతున్నాడని ఆయన దుయ్యబట్టారు. మంబాయి హీరోయిన్ కాదంబరి జాత్వాని పై దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలలోను హాట్రాఫ్ కేసులు ఉన్నాయి. వాటిని కాని, కాదంబరి గత చరిత్రకాని చంద్రబాబునాయుడికి, అతని ప్రభుత్వాధికారులు అవసరం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హాయములో పని చేసిన కొందరి ఐపీఎస్ అధికారులను వేధించేందుకు, వారి పై కేసులు పెట్టేందుకు ప్రధానం స్కీల్ స్కాంలో తనను అరెస్టు చేసిన అధికారులు పై వెంటనే చర్యలు తీసుకోవాలనే దురుద్దేశం మినహా మిగిలినది ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. కొందరు అధికారులను బలిచేసేందుకు చంద్రబాబునాయుడు అడుతున్న నాటకం ఇది అని ఆయన అన్నారు. ఎవరైతో ముంబాయి హీరోయిన్ ఉందో ఆమె కాని, ఆమె ఆరోపిస్తున్న వ్యక్తితో కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మీకు నచ్చినట్టు పోలీసు విచారణ చేయ్యించుకోండి అని ఆయన అన్నారు.
Comments
Post a Comment