అమరావతి బ్యూరోః పీఠాపురంలో మున్సిపాల్ అధికారులు కౌన్సిల్ సమావేశంలో బిల్లు చెల్లింపుల పై ఒకరి పై మరోకరు దాడికి దిగారు. దీంతో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారుల విస్తుపోయారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన దాడి పై ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అశ్చర్యపోయారు. దాడులకు తెగబడిన అధికారులు చిన్నచితక ఉద్యోగులు కాదు వారు ఒకరు మున్సిపల్ కమీషనర్ అయితే మరోకరు మున్సిపల్ డీఈ కావడం విశేషం.పీఠాపురం మున్సిపల్ సమావేశం జరుగుతున్న సమయంలో ఇద్దరు అధికారులు ఒకరి పై మరోకరు పరస్పరం దాడి చేసుకున్నారు. మున్సిపాలిటీ జరిగిన పనులుకు సంబంధించి కాంట్రాక్టర్ల కు చెల్లించవల్సిన బిల్లుల విషయంలో ఇద్దరి అధికారులు గత కొంతకాలం విభేదాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో డీఈ భవానీ శంకర్ శెలువు పై వెళ్లి తిరిగోచ్చారు. డీఈ భవాని శంకర్ ఉండగా, ఈఈ చేత ఫైల్స్ పై కమీషనర్ కనకారావు సంతకాలు చేయించుకోవడంతో వివాదం తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.ఉన్నతస్థానంలో ఉన్న అధికారులు ఇద్దరు ఒకరి పై మరోకరు దాడికి దిగడంతో కౌన్సిల్ సమావేశం రసభసాగా మారింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ వెంటనే అధికారులు దీని పై పూర్తి స్థాయి విచారణ జరిపింది తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Post a Comment