వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు ప‌ర్య‌ట‌న బాధితుల‌ను అదుకుంటాన‌ని భ‌రోసా రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన వ‌ల్ల‌భ‌నేని వంశీ నిర్ల‌క్ష్య‌మే త‌మ‌కు శాపంగా మారిందంటున్న స్థానికులు




అమరావ‌తి బ్యూరోః ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు రాష్ట్రం త‌డిపిముద్ద అవుతుంది. విజ‌యవాడ ప‌రిస‌ర ప్రాంతాల‌లు పూర్తి నీట మునిగిపోయాయి. గ‌తంలో ఎన్న‌డు లేనివిధంగా వ‌ర‌పు నీరు ఇళ్ల‌లోకి రావ‌డంతో జ‌న‌జీవ‌నం స్థంబించిపోయింది.అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున గన్నవరం నియోజకవర్గంలోని అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు , తెలుగు యువత సహాయక చర్యల్లో పాల్గొనాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు.  విజయవాడ రూరల్ , ఉంగుటూరు , గన్నవరం , బాపులపాడు మండలాల్లో అనేక గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో పంట పొలాలు , రోడ్లు పూర్తి గా నీటమునిగాయి . ఈ మేరకు గన్నవరం నియోజక వర్గ వ్యాప్తం గా  ఆయా మండలాల్లో పరిస్థితిని నేరుగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితుల తో మాట్లాడి ఆదుకుంటామని  హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని పరిశీలించాలని సూచించారు .  తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా దృష్టిపెట్టాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో వరద నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .. అవసరమైన ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్ సహాయంతోను లేదా నీళ్ల ఇంజిన్ లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని బయటకు తరలించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి  వరద బాధితులకు ఆహారం అందించాలన్నారు. వర్షాలు తగ్గిన తరువాత ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని మెరగు పరిచేందుకు చేపట్టాల్సిన చర్యల పై అధికారులతో చర్చించి తగు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. టిడిపి నాయకులు కార్యకర్తలు వరద సహక చర్యలు పాల్గొనాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు. యార్ల‌గ‌డ్డ వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న నేప‌ధ్యంలో స్థానికులు వ‌ల్ల‌భ‌నేని వంశీ ఏ రోజులు తమ క‌ష్టంలో త‌మ‌కు అండాలేడ‌ని, వంశీ గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యునిగా ఉన్న‌ప్ప‌టి తాను ఎప్పుడు రాజ‌కీయాల‌ను చేసేందుకుమాత్ర‌మే ప్ర‌య‌త్నించ‌డానికి దుయ్య‌బట్టారు. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం వంశీకి రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చింది కాని వంశీ మాత్రం ఏనాడు నియోజ‌వ‌ర్గ అభివృద్ది కోసం ప‌నిచేయ‌లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వంశీ నియోజ‌క‌వర్గ అభివృద్ది కోసం ప‌ని చేసి ఉంటే ప‌రిస్థితి  ఈ విధంగా ఉండేది కాద‌ని  వారు అంటున్నారు.




 

Comments